మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ తిరునాళ్ల రధోత్సవం కు ప్రత్యేక గుర్తింపు ఉంది.1880 వ సంవత్సరం నుండి మాచర్ల లో స్వామి వారి ని రధం లో ఊరేగిస్తూ గొప్ప ఉత్సవం జరుపుతున్నారు. ఈ నెల 16వ తేది స్వామి వారి రధోత్సవం సందర్బంగా స్వామి వారి కి రధం చేయించిన వంశస్తుల గురించి,రధం యొక్క విశిష్టత గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
గుంటూరు జిల్లా దుర్గి గ్రామానికి చెందిన కంచనపల్లి నారాయణ పంతులు గారు అనే పరమభక్తుడు,అనునిత్యం చెన్నకేశవ స్వామి వారిని పూజింఛే వారు.స్వామి వారికి రధం తయారు చేయించి ఊరేగిస్తే ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కలుగుతుందని బలంగా విశ్వసించి స్వామి వారికి రధం చేయ సంకల్పించి,1879వ సంవత్సరం లో 60 అడుగులు ఎత్తుగల రధం ను చెన్నకేశవ స్వామి వారికి తయారు చేయించారు,అప్పట్లోనే రధం కు 10,000రూపాయిల కు పై గా ఖర్చు అయ్యింది,ఏడు అంతస్తులు గల ఈ రధం కు ఆరు చక్రాలు ఉండి 4 గుర్రాలు,4 సింహాలు,4 ద్వారపాలకుల మొత్తం 12 బొమ్మలు ఉండేలా తయారు చేసారు ఈ రధం తయారీ కి అడవీ లోని కలప వాడారనే అభియోగం తో అప్పటి బ్రిటీషు పాలకులు కంచనపల్లి నారాయణ గారి పై కేసు నమోదు చేసారు,సంబందిత అధికారి కలలో శ్రీ చెన్నకేశవ స్వామి వారు కనిపించి,తన కోసమే రధం తయారీ చేసినందున క్షమించి వదలి వేయమని తెలిపినట్లు అందుకు నారాయణ రావు గారి పై కేసు తీసివేసి నట్లు కధలు ప్రచారం లో ఉన్నాయి. ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు స్వామి వారి బ్రహ్మోత్సవాలు మొదలు పెడతారు.ఇప్పటికి రధం చేయించిన కంచనపల్లి వంశీయులు,శీతిరాజు వంశీయులు ఆద్వర్యం లో ఉత్సవాలు జరుగుతాయి,అలనాటి నుండి ఈ ఆచారం అలాగే సాగుతుంది 1880 లో మెదటి సారి స్వామి వారి ఉత్సవాలు రధం పై ఊరేగింపు జరిగి ఆ కార్యక్రమం నేటికి ప్రతి సంవత్సరం గొప్ప వేడుక గా జరుగుతూనే ఉంది, 137 సంవత్సరాలు గా ఈ రధోత్సవం భక్తుల మధ్య కన్నుల పండుగ గా జరుగుతుంది,137 సంవత్సరాల క్రితం రధం లాగటానికి తయారు చేయించిన ఇనుప గొలుసులు నేటికి దృడంగా ఉండటం విశేషం.. 1880 కి ముందు రధం తయారీ కానప్పుడు దేవాలయం పక్కనే ఉన్న చంద్రవంక నది లో 5 రోజులు పాటు స్వామి వారికి తెప్పోత్సవం నిర్వహించేవారు,1990 ల వరకు కూడా చంద్రవంక నీరు స్వచ్చంగా ఉండేది. ప్రస్తుతం కలుషితంగా మారింది..భారత దేశం లో తూర్పు నుండి పడమర గా ఉత్తర వాహిని ప్రవహించే ఏకైక విశిష్టత కలిగిన చంద్రవంక నది ని కాలుష్యం నుండి కాపాడవలసిన భాధ్యత ప్రస్తుత అధికారులు,పాలకుల పై ఉన్నది.ఈ నది ప్రక్షాళన కు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
రధాన్ని భక్తి శ్రద్దల తో అన్ని కుల,మతాల వారు యువకులు,వృద్దులు కూడా భక్తి పారవశ్యం తో జై చెన్నకేశవ అంటూ భక్తి పారవశ్యం తో లాగుతూంటారు.900 సంవత్సరాల క్రితమే అన్ని మతాలు కులాలను ఏకం చేసి దేవాలయ ప్రవేశం చేసి చాపకూడు ద్వారా అందరు ఒకే పంచన భోజనం చేయించిన బ్రహ్మనాయుడు గారు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయాన్ని చాలా అబివృద్ది చేసారు. అందుకే నేటికి పల్నాడు గడ్డ పై అన్ని పండుగలు అన్ని మతాల వారు,కులాల వారు కలసి చేసుకుంటారు,ఇక్కడ కుల,మతాలకు పట్టింపు ఉండరు,అందరు ఐకమత్యం తో ఉంటారు. స్వామి వారి రధాన్ని ముస్లింలు,క్రైస్తవులు,హిందువులు అందరు కలసి లాగుతారు. ప్రతి సంవత్సరం రధం కు కె.సి.పి.సంస్త ఆద్యర్యం లో మరమ్మత్తులు నిర్వహించి అలంకరిస్తారు. ప్రతి యేటా జరిగే స్వామి వారి రధోత్సవానికి లక్ష మంది దాకా భక్తులు వస్తారు,వీరి కోసం మాచర్ల లో పలు స్వచ్చంద సంస్తలు నీరు,మజ్జిగ,వైద్య సదుపాయాలు ఏర్పాట్లు చేస్తాయి. అతి మహిమాన్విత,చారిత్రక శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కోసం అనేక వ్యయ ప్రయాసలు కు ఓర్చుకుని రధం చేయించి లక్షలాది భక్తుల హృదయాల్లో నే గాక,స్వామి వారి మనసు లో కూడా శాశ్వతంగా నిలిచిపోయిన కంచనపల్లి నారాయణ పంతులు గారు మరియు వారి వంశీకుల చరిత్ర తరతరాలు గా మన పల్నాడు గడ్డ పై మారుమోగుతూనే ఉంటుంది.మన అందరి కి స్వామి వారికి రధం పై చూసే భాగ్యం కలిగించినందుకు పల్నాడు లో ప్రతి ఒక్కరం కంచనపల్లి నారాయణ పంతులు గారికి కృతజ్ఞతలు తెలుపుదాం.జై చెన్నకేశవ.......
STD CODE: 08642
PIN CODE: 522426
Total Words: 29
Assembly Constituency: Macherla
Parliamentary Constituency: Narasaraopet
OverView:
Macherla is one of the Town in Macherla Mandal in Guntur District in Andhra Pradesh State . Macherla is Main Town for the Macherla Mandal and also MandalHead . Macherla is 106.8 km far from its District Main City Guntur . It is 143 km far from its State Main City Hyderabad .
Near By Villages of this Village with distance are Rayavaram(3.9 k.m.) ,Manchikallu(8.6 k.m.) ,Atmakur(8.6 k.m.) ,Pasuvemula(8.7 k.m.) ,Paluvoi(9.1 k.m.) ,. Nearest Towns are Macherla(1.5 k.m.) ,Durgi(11.7 k.m.) ,Rentachintala(13.6 k.m.) ,Veldurthy(15.6 k.m.) ,Bhiravunipadu , Chintala Thanda , Ekonampet , Gannavaram , Jammalamadaka , Kambampadu , ... . are the villages along with this village in the same Macherla Mandal.
Macherla Pin Code is 522426 and Post office name is Macherla . Other villages in Post Office (522426,Macherla) are Gannavaram , Koppunuru , Rayavaram , Macherla , Mandadi .
Present Political Status:
MP
Sri Rayapati SanbaSiva Rao Garu (TDP)
MLA
Thanks for your info bro.. But please update political info..
ReplyDeleteThanks